Sunday, September 8, 2024
HomeTrending NewsTDP: ఫుడ్ డెలివరి లాగా మద్యం డెలివరి: అచ్చెన్న

TDP: ఫుడ్ డెలివరి లాగా మద్యం డెలివరి: అచ్చెన్న

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాలలో అత్యంత ప్రధానమైనదని మద్యపాన నిషేధమని, దాన్ని అమలు చేయడంలో వైఎస్ జగన్ విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటల్స్ లో తప్ప మరెక్కడా మద్యం దొరక్కుండా చూస్తామని కూడా చెప్పారని గుర్తు చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, కోమటి జయరాంలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఐదేళ్లుగా ఊరూ వాడా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని…  ఫుడ్ డెలివరీ చేయడానికి స్విగ్గీ, జొమాటోలు ఉన్నట్లు… వైసీపీ నేతలు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారని… సినిమాలో బ్లాక్ టిక్కెట్లు అమ్మినట్లు మద్యాన్ని విక్రయిస్తూ పేదల ప్రాణాలు తీస్తున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం హయంలో ఉన్న ఏ బ్రాండ్  కూడా ఇప్పుడు లేదని, ఇప్పుడు మద్యానికి కర్త, కర్మ, క్రియ అంతా జగన్ మాత్రమేనని, మద్యం తయారు చేయించడం, విక్రయించడం కూడా చేస్తున్నారని వెల్లడించారు.  ఈ ప్రభుత్వం అందిస్తోన్న నాసిరకం మద్యంతో 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారని, ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళినా లివర్ సంబంధిత బాధితులే ఎక్కువమంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఐదేళ్ళ తమ ప్రభుత్వ హయంలో మద్యంపై 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, కానీ ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో మద్యం ద్వారా లక్షా 10 వేల కోట్ల రూపాయలు అధికారికంగా ఆదాయం వచ్చిందని వివరించారు. మరో లక్ష కోట్లు లెక్కలు లేకుండా అక్రమంగా ఆర్జించారని పేర్కొన్నారు. రూ. 60 ఉండే క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.25౦-3౦౦ కు పెంచారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 3౦ వేల కోట్ల రూపాయలు అప్పుడు తెచ్చిన చరిత్ర కూడా జగన్ దే నని విమర్శించారు. మద్యపానాన్ని నిషేధించిన తరువాతే వచ్చే ఎన్నికలకు వెళ్తానంటూ జగన్ గతంలో ఇచ్చిన హామీ నిజమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు.

హామీల్లో కనీసం 3౦ శాతం కూడా పూర్తి చేయలేదని కానీ 99 శాతం అమలు చేశామంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారని, తప్పుల తడకతో బుక్ లేట్ వేసి ప్రజలకు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ మాట్లాడుతుంటారని… కానీ ప్రతిరోజూ వారిపై దాడులు, దమనకాండ జరుగుతోందని ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్