టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన ‘యువగళం‘ పాదయాత్ర ఈ రోజు (శుక్రవారం) ఉదయం 11.03 గంటలకు ప్రారంభమైంది. ముందుగా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇప్పటికే కుప్పం చేరుకున్నారు.
లోకేష్ వెంట బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, ఇతర నేతలు ఉన్నారు. మొత్తం 400 రోజులు.. 4 వేల కిలోమీటర్ల నడవనున్నారు లోకేష్. మొదటి రోజు 8.4 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3గంటలకు యువగళం సభలో లోకేష్ పాల్గొననున్నారు. పాదయాత్రలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం జరిగే సభను భారీఎత్తున నిర్వహించేలా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై 300 మంది నాయకులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
సభావేదిక వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 400 మంది వాలంటీర్లను మోహరించారు. వీరికితోడు అదనంగా మరో 200 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండనున్నారు. అయితే, ఈ సభలో నారా లోకేశ్ తో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగిస్తారని తెదేపా వర్గాల సమాచారం.
కుప్పం పాదయాత్ర తోలి రోజే అపశృతి చోటు చేసుకుంది. వాహనం నుంచి జారి పడిన తారక రత్న స్వల్ప గాయాలు.. కేసి ఆసుపత్రికి తారకరత్న తరలించిన తెలుగుదేశం నేతలు.