Friday, February 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్ట్‌ చేసింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. అనంతరం నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ వాహనంలో తీసుకెళ్లారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. మరోవైపు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నరేంద్రను అరెస్ట్‌ చేయడమేంటని తెదేపా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్