Sunday, September 22, 2024
HomeTrending Newsబాలా సాహెబ్‌ సమాధి వద్ద హై డ్రామా

బాలా సాహెబ్‌ సమాధి వద్ద హై డ్రామా

శివసేన సుప్రీం బాల్ సాహెబ్ థాకరే చనిపోయి పదేళ్ళు అయినా మహారాష్ట్రలో ఆయనకు చెక్కు చెదరని గౌరవం ఉంది. ముఖ్యంగా ముంబైలో థాకరే అభిమానులకు కొదవ లేదు. అయితే ఇటీవల మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు ఆయన అభిమానులకు నిరాశ కలిగించే విధంగా ఉన్నాయి. నిన్న ఆయన సమాది వద్ద జరిగిన ఘటన పై  భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

శివసేనలోని రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. నవంబర్ 17న పార్టీ వ్యవస్థాపకుడు బాలా సాహెబ్‌ థాక్రే పదో వర్ధంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే.. ముంబై శివాజీ పార్కులోని బాలా సాహెబ్‌ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి చెందిన కొందరు షిండే రాకతో ఆ ప్రాంతం అపవిత్రమైందని.. గో మూత్రం, నీటితో బాలాసాహెబ్‌ మెమోరియల్‌ను శుద్ధి చేశారు.

అయితే ఉద్ధవ్‌ వర్గం తీరుపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలాసాహెబ్‌ ఏ ఒక్కరికి చెందినవారు కాదని షిండే వర్గానికి చెందిన ఓ నేత అన్నారు. థాక్రేకు ఎవరైనా నివాళులు అర్పించవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో బాలాసాహెబ్‌కు షిండే శ్రద్ధాంజలి ఘటించారని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్