Sunday, May 19, 2024
HomeTrending NewsPM Awas Yojana: మీపేరు ఎలా పెట్టుకుంటారు?

PM Awas Yojana: మీపేరు ఎలా పెట్టుకుంటారు?

Churches :  రాష్ట్రంలో  అర్బన్ ప్రాంతంలో 20 లక్షలు, రూరల్ లో 5 లక్షల ఇళ్ళను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ఒక్కోఇంటికి లక్షా 80 వేల రూపాయలు ఇస్తోందని, వీటిలో నేరుగా లక్షన్నర, ఉపాధి హామీ కింద 30 వేలు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇస్తోందని చెప్పారు. మొత్తంగా 35 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇస్తోందని వెల్లడించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 11వేల కోట్లు, అదికూడా భూములు కొనుగోలుకోసమే ఖర్చు పెట్టారని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు జగనన్న కాలనీలు అని పేరు ఎలా పేరు పెడతారని నిలదీశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటే నిస్సిగ్గుగా మీ పేరు ఎలా పెట్టుకుంటారని సోము అడిగారు. విజయవాడలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.  కేంద్ర నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించి, లబ్దిదారులకు రుణాలు ఇప్పించి వెంటనే ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయించాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

చర్చ్ ల నిర్మాణానికి 175 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సోము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన సొంత డబ్బులు ఇవ్వాలని, లేదా ఆయన బావను ఇవ్వమని చెప్పాలని సలహా ఇచ్చారు. ఈ నిర్ణయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ధనాన్ని చర్చ్ లకోసం ఎలా ఇస్తారని, ఇది ప్రభుత్వ మతతత్వ వైఖరిని తెలియజేస్తోందని, ప్రజలు హిందూ దేవాలయాలకు ఇచ్చిన నిధులతో ఇతర దేవాలయాలు నిర్మిస్తారని… ప్రభుత్వ నిధులతో కాదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్