Sunday, January 19, 2025
Homeసినిమా ‘హిట్ 2’ నుంచి ‘ఉరికే ఉరికే...’ సాంగ్ ప్రోమో రిలీజ్

 ‘హిట్ 2’ నుంచి ‘ఉరికే ఉరికే…’ సాంగ్ ప్రోమో రిలీజ్

అడివి శేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ఈ చిత్రంలో ఆయన కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శైలేష్ కొలను ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్షన్‌లో ఇంతకు ముందు రూపొంది ఘన విజయాన్ని సాధించిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ చిత్రానికి ఇది ఫ్రాంచైజీగా రూపొందింది. అడివి శేష్ ఇందులో కె.డి అనే పాత్రలో కనిపిస్తుంటే.. ఆయనకు జోడీగా ఆర్య అనే పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ భారీ రేంజ్‌లో విడుదలవుతుంది.

గత వారం విడుదలైన ‘హిట్ 2’ టీజర్‌కి టెరిఫిక్ రెస్పాన్ష్ వచ్చింది. ఇప్పుడు ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ సాంగ్‌తో ఆడియెన్స్‌ని అలరించబోతున్నారు. ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఫస్ట్ టైమ్ మేకర్స్ ‘ఉరికే ఉరికే..’ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా ఫుల్ సాంగ్ ట్రీట్‌లా ఉండబోతుందని తెలుస్తుంది. బ్యూటీఫుల్ విజుల్స్, దానికి తగ్గ ట్యూన్ మ్యాజిక్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించారు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ శ్రావ్యమైన గొంతు వినటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యారీ బి.హెచ్ ఎడిటర్, ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు

Also Read :  ‘హిట్ 2’ చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను – అడివి శేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్