Monday, February 24, 2025
Homeసినిమాచరణ్‌, బుచ్చిబాబు ప్రాజెక్ట్ కథ ఏమిటి?

చరణ్‌, బుచ్చిబాబు ప్రాజెక్ట్ కథ ఏమిటి?

ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించారు. దీంతో చరణ్‌ కు సౌత్ లోనే కాదు.. నార్త్ లో కూడా మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవలే జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కావడంతో అక్కడ కూడా చరణ్‌ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో చరణ్‌ నెక్ట్స్ చేయబోయే సినిమాల గురించి ఆరా తీస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్-చరణ్‌ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

దీని తర్వాత చరణ్‌.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి బుచ్చిబాబు చరణ్‌ని ఎలా ఒప్పించాడు..? అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ స్టోరీ ఏంటంటే… శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ స్పోర్ట్స్ డ్రామాగా తెలిసింది.

అయితే.. ఈ కథను ముందుగా ఎన్టీఆర్ కు చెప్పాడు. ఇందులో ఓల్డ్ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపించలేదట. అంతే కాకుండా వీర్ ఛైర్ కి మాత్రమే పరిమితం అయ్యే పాత్ర వయసు మళ్లిన క్యారెక్టర్ కావడం వల్లే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ని నో చెప్పాడట. ఫైనల్ గా బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు స్టోరీ చెప్పడం.. తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంటెన్సిటీతో వున్న పవర్ ఫుల్ క్యారెక్టర్ లో స్పోర్ట్స్ మెన్ గా రామ్ చరణ్ ఇందులో కనిపించబోతున్నాడు. మరి.. చరణ్ నమ్మకాన్ని బుచ్చిబాబు ఎంత వరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.

Also Read చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ 2024లో వ‌స్తుందా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్