బైంసా నుండి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ వెళుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జగిత్యాల దాటాక ఈ రోజు రాత్రి 11 గంటలకు అడ్డుకున్న పోలీసులు. రోడ్డుకు అడ్డంగా వాహనాలను ఉంచి బండి సంజయ్ ను చుట్టుముట్టిన పోలీసులు పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ కార్యకర్తలు…పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగిత్యాల పట్టణ శివారులో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత .
భారీ ఎత్తున తరలివస్తున్న బీజేపీ కార్యకర్తలు. అడుగడునా బండి సంజయ్ కు మద్దతు తెలుపుతూ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు. పాదయాత్ర కు, బహిరంగ స భకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతి రద్దు చేయడంపై కార్యకర్తల్లో పెల్లుబికితున్న ఆగ్రహం. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయిస్తూ పోలీసుల తీరును నిరసిస్తున్న కార్యకర్తలు. సీఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం దారుణమంటూ మండిపడుతున్న కార్యకర్తలు.