Saturday, November 23, 2024
HomeTrending Newsకాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారు - మంత్రి వేముల

కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారు – మంత్రి వేముల

కేసిఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని,కానీ కేసిఆర్ ఎవరో ఆపితే ఆగే వ్యక్తి కాదని ఆయనో శక్తి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఒక్కసారి అనుకుని బయలుదేరితే లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటాడని,గమ్యాన్ని ముద్దాడి తీరుతాడని తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్,మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలకు చెందిన వార్డు సభ్యులు,నాయకులు,యూత్ సభ్యులు పలువురు ఈ రోజు (శనివారం) రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయమన్నారు. దేశ బాగు కోసం కేసిఆర్ ఎందాకైన కొట్లాడుతాడని స్పష్టం చేశారు. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో…ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థకు కేసిఆర్ అంతే అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు కేసిఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తూ,బిఆర్ఎస్ పార్టీని అక్కున చేర్చుకుంటున్నారన్నారు. దేశమంతటా తెలంగాణ తరహా అభివృద్ది కావాలని కోరుకుంటున్నారన్నారు.

రైతు బంధు,రైతు భీమా,24 గంటల ఉచిత విద్యుత్,సాగునీరు, మిషన్ భగీరథ,కళ్యాణ లక్ష్మి,కేసిఆర్ కిట్,ఆసరా పెన్షన్,కుల వృత్తులకు ప్రోత్సాహం ఇలా కేసిఆర్ అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాల గురించి అన్ని రాష్ట్రాల ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని అదోగతి పాలు చేస్తుందని,తెలంగాణ మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని ద్వజమెత్తారు. తెలంగాణలో రైతులకు కల్లాలు వద్దనడం బీజేపీ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఇక్కడి బీజేపీ నేతలకు రాజకీయం తప్పా.. తెలంగాణ బాగు పట్టదని విమర్శించారు. తమ మిత్ర కార్పొరేట్లకు దేశ సంపద దోచి పెడుతూ…రైతులను,పేదలను అరిగొస పెడుతున్నారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ,కాంగ్రెస్ లతో ప్రజలు విసిగిపోయారని,రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభావం ఉంటుందని చెప్పారు.”అబ్ కి బార్ కిసాన్ సర్కార్” అని మంత్రి వేముల స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్