Budget Cuts : పాకిస్తాన్ ప్రభుత్వ చర్యలతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిరసనలు పెరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దిగిపోయాక కొత్తగా వచ్చిన షేహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కశ్మీరీల బాగోగులు పట్టించుకోవటం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా ఆక్రమిత కశ్మీర్ కు ఏటా ఇచ్చే బడ్జెట్ లో భారీ కొత్త విధించటం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. ఏటా 7 బిలియన్ల బడ్జెట్ కేటాయిస్తుండగా ఇప్పుడు కేవల అయిదు బిలియన్లు కేటాయిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవ హక్కుల నేత షౌకత్ అలీ కశ్మీరీ పాక్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆజాద్ కశ్మీర్ లో విద్య, వైద్య సౌకర్యాలు కుంటు పడ్డాయని, ప్రభుత్వం కేటాయించే నిధుల్లో ఎక్కువ శాతం సైన్యం ఖర్చులకే సరిపోతుందని… ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పాక్ ప్రభుత్వాలు మరచిపోయాయని షౌకత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన కశ్మీర్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినపుడు కశ్మీర్ లోయ అభివృద్ధి పాకిస్తాన్ ముస్లిం లీగ్ లక్ష్యమని ఆ పార్టీ నేత మరియం నవాజ్ అనేక సభల్లో ప్రకటించారు. అధికారంలోకి రాగానే కశ్మీర్ పై కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని ముజఫరాబాద్ లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల ఆందోళనలు, నిరసనలు మీడియాలో రాకుండా పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ మీడియాను అక్కడకు వెల్లనీయటం లేదు. పూర్తిగా పాక్ సైన్యం కనుసన్నల్లోనే పరిపాలన సాగుతోంది. దీనికి తోడు ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నాపుడు ఆయన అనుకూల వర్గం గెలవటం కూడా కశ్మిరీల కష్టాలకు కారణం అయింది.
ఎన్నికల పేరుతో కీలు బొమ్మ ప్రభుత్వాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏర్పాటు చేయటం మొదటి నుంచి ఆనవాయితీగా మారింది. ఇస్లామాబాద్ లో ఎవరు అధికారంలో ఉంటే వారి హయంలో జరిగే ఎన్నికల్లో అదే పార్టి గెలవటం రివాజుగా వస్తోంది. ఎవరు గెలిచినా సైన్యం కనుసన్నల్లో పాలన సాగించాల్సిందే.
Also Read : మరో కశ్మీర్ పండిట్ ను బలిగొన్న ఉగ్రవాదులు