Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

జమ్ముకశ్మీర్లో మరో హిందూ టీచర్ను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గాం సమీపంలోని గోపాల్ పొర లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం విధులకు హాజరైన ఉపాధ్యాయురాలిని వివరాలు తెలుసుకొని మరి టెర్రరిస్ట్ లు కాల్పులకు దిగారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. చనిపోయిన ఉపాధ్యాయిని జమ్ములోని సాంబ సెక్టార్ కు చెందిన  వారని జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇటీవలే ఓ కాశ్మీర్ పండిట్ ను బలిగొన్న ఉగ్రవాదులు తాజాగా మరోకరిని చంపటంతో లోయలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అంతకు ముందు ఈ రోజు వేకువ జామున అవంతిపురలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పులతో ఈ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. మృతుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల్ని చంపిన కేసులో నిందితులని జమ్ముకశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read : బారాముల్లాలో ముగ్గురు ఉగ్రవాదుల హతం  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com