Sunday, February 23, 2025
HomeTrending Newsదేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఈ రోజు (గురువారం) ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు), హర్యానాలోని అదమ్‌పూర్, తెలంగాణలో మునుగోడు, యూపీలో గోల గోకర్‌నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆయా నియోజకవర్గ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరణించడం, మరికొన్నింటిలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. గత నెలలో ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేయనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్