Sunday, January 19, 2025
HomeTrending Newsజయహో బీసీ మహాసభ... ముస్తాబైన విజయవాడ

జయహో బీసీ మహాసభ… ముస్తాబైన విజయవాడ

వెనుకబడిన కులాలే వెన్నెముక అనే నినాదంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. చరిత్రలో మొదటిసారిగా బీసీలకు మంత్రి పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింట్లో సిఎం ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు సిఎం హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం బిసీల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ సిఎం వివరించనున్నారు. రాష్ట్ర బిసీ నేతలు మహాసభ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జయహో బిసీ తోరణాలతో విజయవాడ నగరాన్ని ముస్తాబు చేశారు.

ఉదయం 11.50 – మధ్యాహ్నం 1.00 గంట వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు హాజరుకానున్న సీఎం, తర్వాత 2.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.25 గంటలకు నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు. 3.55 – 4.10 వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్