Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణ ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు

తెలంగాణ ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు

రాష్ట్రంలో అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించ నున్నట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు, క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలలో ముఖ్యమంత్రి, పలువురు క్రైస్తవ ప్రముఖులతో కలిసి పాల్గొంటారని చెప్పారు.
దాదాపు 15 వేల మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులకు సకాలంలో ఆహ్వానాలు అందజేయాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. వచ్చే అతిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు, అందరూ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పేద క్రైస్తవులకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని చర్చిలలో క్రిస్మస్ విందులను నిర్వహిస్తూ వస్తుందన్నారు, తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులను గౌరవిస్తుందని చెప్పారు,

ఈనెల 21న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్ బిషప్ ఏం. ఏ.డానియల్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. సోమవారం అబిడ్స్ చాపెల్ రోడ్ లోని బిషప్ హౌస్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక అందచేసి శాలువా తో సత్కరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహ పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారని మంత్రి బిషప్ కు తెలిపారు. విషప్ హౌస్ కు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ని బిషప్ డానియల్, పలువురు చర్చి ఫాదర్ లు ఘన స్వాగతమ్ పలికారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు,తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, శంకర్ లూక్, మైనారిటీ కార్పొరేషన్ ఎండి క్రాంతి వెస్లీ, విద్యా స్రవంతి, కో అప్షన్ సభ్యులు మలత రత్నం, భారత జాగృతి రాజేంద్ర నగర్ కన్వీనర్ రగడంపల్లి శ్రవణ్, పలు చర్చిల ఫాదర్లు, క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్