Saturday, November 23, 2024
HomeTrending Newsఈనెల 22న వైఎస్సార్ చేయూత

ఈనెల 22న వైఎస్సార్ చేయూత

ఈనెల 22న వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల స్వయం ఉపాధికి ప్రతీఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75వేల ఆర్ధిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూడో ఏడాది సాయాన్ని ఈనెల22న ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది

మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు.

మంత్రివర్గ నిర్ణయాల్లో కొన్ని…

  • జలజీవన్‌మిషన్‌ ద్వారా 6 జిల్లాలకు తాగునీటి సరఫరాకు సంబంధించి నాబార్డు ద్వారా రూ.4020 కోట్ల రుణం.
  • గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి  ఆమోదం.
  • గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.20 లక్షల నిధులు మంజూరుకు ఆమోదం
  • గ్రేటర్‌ విశాఖ మున్సిపాల్టీ పరిధిలో విశాఖ జిల్లాలో 96,250 ఇళ్లు, అనకాపల్లి జిల్లాలో 3,750 ఇళ్ల నిర్మాణం.
  • నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 21.30 లక్షల ఇళ్లు మంజూరు.
  • విశ్వవిద్యాలయాలకు సంబంధించి పలు చట్టాల సవరణకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డ్రాప్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.
  • నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.
  • ప్రతి ప్రభుత్వ విభాగంలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు నియామకాల్లోనూ, పదోన్నతుల్లోనూ కల్పించేలా… ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ – 1996కు చట్ట సవరణ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం సాధారణ పరిపాలనవిభాగంలో వివిధ కేడర్లలో 85 అదనపు పోస్టుల మంజూరుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
  • పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో ఉన్న మున్సిపల్‌ స్కూళ్లను వాటి పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • ప్రభుత్వ స్కూళ్ల తరహాలో పటిష్టమైన నిర్వహణ, పర్యవేక్షణ కోసమే ఈ నిర్ణయం.
  • అమరావతిలో ఫేజ్‌ –1 కింద మౌలిక సదుపాయాల కల్పనా పనులకు రూ.1600 కోట్లు రుణానికి సంబంధించి ప్రభుత్వం బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేపడుతున్న అభివృద్ధి పధకాల అమలు కోసం… ఏపీసీఆర్డీఏ యాక్టు –2104, ఏపీఎంఆర్‌ అండ్‌ యూడీఏ యాక్ట్‌ – 2016లో సవరణలకు కేబినెట్‌ ఆమోదం.
  • గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ ఎర్త్‌ వర్క్‌ లకు పరిపాలనాపరమైన అనుమతులు
  • గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన విధంగానే.. పైడిపాలెం ప్రాజెక్టు పరిధిలో పైడిపాలం, కుమరంపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లింపు
  • ఈ నెల 5వతేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ – స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిన 175 మంది ఖైదీలతో పాటు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 20 మంది ఖైదీలకు ప్రత్యేకంగా మంజూరు చేసిన క్షమాభిక్ష నిర్ణయానికి  కేబినెట్‌ ఆమోదం.
  • రాష్ట్ర సర్వోన్నత న్యాయస్ధానంలోని గౌరవ న్యాయమూర్తులకు, రిజిస్ట్రార్లకు 71  కోర్టు మాష్టర్లు, పర్సనల్‌ సెక్రటరీల పోస్టుల నియామకానికి కేబినెట్‌ ఆమోదం.
  • శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్‌ అదాలత్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. ఆయా లోక్‌అదాలత్‌ల పరిధిలో 40 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • పారిశ్రామికాభివృద్ధి తోడ్పాటులో భాగంగా అనంతపురం జిల్లాలో కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రాయితీలు.
  • ఏపీఐఐసీ, కియా మధ్య జరిగిన ఒప్పందంలో భూమి కేటాయింపులకు సంబంధించిన స్టాంప్‌ డ్యూటీ , రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలను  మినహాయిస్తూ కేబినెట్‌ ఆమోదం.
  • తిరుపతి జిల్లా పేరూరులో నోవాటెల్‌ బ్రాండ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, ఫ్యామలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ల నిర్మాణం, అభివృద్ధి కోసం ఓబెరాయ్‌ గ్రూపునకు 30.32 ఎకరాల భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
  • ఆంధ్రప్రదేశ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.

Also Read : ఇదో అరుదైన ఘట్టం: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్