అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన పుష్ప చిత్రం టాలీవుడ్ లో కన్నా ఎక్కువుగా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం. అక్కడ అంతగా ప్రమోట్ చేయకపోయినా.. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలీవుడ్ మేకర్స్ కి షాక్ ఇచ్చింది. దీంతో ‘పుష్ప 2’ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల పుష్ప 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్వరలో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. పుష్ప 2 బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏంటంటే.. ఈ మూవీ బడ్జెట్ వింటుంటే.. అవునా..? ఇది నిజమా..? అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే.. అంత భారీ అంకెలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమాకు బడ్జెట్ నాలుగు వందల నుంచి అయిదు వందల కోట్లు అని టాక్ వినిపిస్తుంది. కనీసం 100 కోట్ల లాభం టార్గెట్ అన్నది మరో అంకె వినిపిస్తోంది. ఇక రెమ్యూనరేషన్స్ విషయానికి వస్తే.. హీరో బన్నీకి 100 కోట్ల రెమ్యూనిరేషన్ 30 శాతం లాభాల్లో వాటా అని టాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇక డైరెక్టర్ సుకుమార్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. 25 కోట్ల రెమ్యూనిరేషన్ 30 శాతం లాభాల్లో వాటా అని టాక్. నిర్మాతలకు 40 శాతం వాటా అన్నమాట. అంటే ఈ లెక్కన తెలుగులో హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ అందుకోబోతున్న హీరో బన్నీనే. ఎందుకంటే.. వంద కోట్ల రెమ్యూనిరేషన్ ప్లస్ థర్టీ పర్సంట్ వాటా అంటే కనీసం 130 కోట్ల వరకు వుండొచ్చు. ఇక షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది..? రిలీజ్ ఎప్పుడంటే.. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. 2023 చివరికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఒకవేళ కుదరకపోతే.. 2024 సంక్రాంతి లేదా సమ్మర్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనేది ప్లాన్.