ధాన్యం కొనుగోలు అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. రైతాంగం తరపున ఢిల్లీలో తెరాస ధర్నా చేసిన మరుసటి రోజే రైతులు బిజెపి నేత, నిజామాబాదు ఎంపి ధర్మపురి అరవింద్ ఇంటిని చుట్టుముట్టారు. ఈ రోజు(మంగళవారం) నిజామాబాద్ జిల్లా పెర్కిట్ లోని అరవింద్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. యెసంగి వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు రైతులు వరిదాన్యాన్ని అరవింద్ ఇంటి ముందు పోశారు. జిల్లా నలుమూలలనుండి రైతులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేసేలా ఎంపి ఒత్తిడి చేయాలని రైతులు నినాదాలు చేశారు. ఇటీవల జిల్లాలో రైతులు ఎంపి అరవింద్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆయన వాహనంపై దాడికి యత్నించారు.
Also Read : మోదీకి 24 గంటల డెడ్‌లైన్..సిఎం కెసిఆర్