టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటుగా స్పందించారు. పేపర్ లీకేజీ అంశంలో తాజా నివేదికను రాజ్‌భవన్‌కు పంపాలని ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదికను ఇవ్వాలని సిఎస్, టిఎస్‌పిఎస్‌సి, డిజిపికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి (CS), డిజిపి అంజనీ కుమార్ (DGP), టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి జనార్ధన్ రెడ్డి లకు రాజ్ భవన్ నుంచి లేఖ పంపారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టేటస్‌తో సహా లీకేజీపై ప్రస్తుతం ఉన్న స్థితి నివేదికను తెలియజేయాలని కోరిన రాజ్ భవన్…కమీషన్ అనుమతితో లేదా అనుమతి లేకుండా పరీక్షలకు హాజరైన రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని లేఖలో ఆదేశించారు. పరీక్షలలో వారికి వచ్చిన మార్క్ లు, వారు ఏమైనా లీవ్ పెట్టారా … తదితర వివరాలను అందించాల్సిందిగా TSPSCని రాజ్ భవన్ కోరింది.
అంతకు ముందు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శికి లేఖ రాసిన సంగతి విదితమే. తన లేఖలో సమగ్ర విచారణకు ఆదేశించి, లీకేజీపై వివరణాత్మక నివేదికను కోరిన సంగతి తెలిసిందే. అసలైన అభ్యర్థుల భవిష్యత్తు, ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను తక్షణమే తీసుకోవాలని, బాధ్యులందరిపై పై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్ననర్ తమిళిసై ఆదేశించిన సంగతి విదితమే.
Also Read : TSPSC:రేవంత్, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు