Monday, February 24, 2025
Homeసినిమాశరవేగంగా 'హరి హర వీరమల్లు' చిత్రీకరణ

శరవేగంగా ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది.

అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు.ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెర పై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం అని మెగా సూర్య ప్రొడక్షన్ తెలియచేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్