Sunday, January 19, 2025
HomeTrending Newsఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా: ఐఏఎస్ సోమేశ్ కుమార్

ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా: ఐఏఎస్ సోమేశ్ కుమార్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ మాజీ సిఎస్  సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. నేటి లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేసేందుకు సోమేశ్ కుమార్ విజయవాడ చేరుకున్నారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కారదర్శి డా. జవహర్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సిఎస్  తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా కలవనున్నట్లు ఆయన వెల్లడించారు.  ఏపీలో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని,  ప్రభుత్వ ఉద్యోగిగా ఏ బాధ్యత అప్పగించినా  హోదాతో పని లేకుండా పనిచేస్తానని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్