అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 వరకూ ఆస్ట్రేలియాలో జరగనున్న వరల్డ్ కప్ టి-20 టోర్నమెంట్ కు టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయం కారణంగా రవీంద్ర జడేజా టోర్నీకి దూరమయ్యాడు. వరల్డ్ కప్ తో పాటు ఈ నెలలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరగనున్న టి 20 సిరీస్ లకు కూడా జట్టును ప్రకటించింది.
జట్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి….
వరల్డ్ కప్ టి 20: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆర్షదీప్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్లు: మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
ఆస్ట్రేలియా సిరీస్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్
సౌతాఫ్రికా సిరీస్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష దీప్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్
హార్దిక్ పాండ్యా, ఆర్ష దీప సింగ్, భువనేశ్వర్ కుమార్ లు బెంగుళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో హాజరై తమ ఫిట్ నేస ను నిరూపించుకోవాల్సి ఉంటుందని బిసిసిఐ తెలిపింది.
గాయాల కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరమైన జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులో చేరారు. ఆసియా కప్ టీమ్ లో ఉన్న రవి బిష్ణోయ్ వరల్డ్ కప్ టీమ్ లో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్నాడు. మహమ్మద్ షమీ, దీపక్ చాహర్ లు కూడా స్టాండ్ బై ప్లేయర్ల లిస్టులో చేరారు.