Sunday, January 19, 2025
HomeTrending Newsచంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ!

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  .. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జీవో నంబర్ 1 అమల్లో ఉన్నందున రోడ్ షో, బహిరంగ సభలకు రోడ్లపై అనుమతి లేదని పోలీసులు  చంద్రబాబును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాబు పోలీసులతో పాటు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పవన్ చంద్రబాబును కలుసుకొని సంఘీభావం తెలియజేయనున్నారు. జీవో నంబర్ వన్, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ లో రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా ఇద్దరు నేతల మధ్యా చర్చలు జరిగే అవకాశం ఉంది.

గతంలో పవన్ వైజాగ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోవడం, ఆ తర్వాత మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో వైసీపీ నేతలపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన దరిమిలా ఆరోజు చంద్రబాబు విజయవాడలోని ఓ హోటల్ లో బస చేసి ఉన్న పవన్ కళ్యాణ్ ను కలుసుకొని సంఘీ భావం తెలిపారు చంద్రబాబు.  మళ్ళీ నేడు ఇద్దరు నేతలు మరోసారి కలుసుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్