నాగార్జున కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. సీనియర్ హీరోల్లో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హీరోగా నాగార్జున సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కళ్యాణ్ కృష్ణ దీనిద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మూవీ తర్వాత అక్కినేని నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించింది. ఆతర్వాత మాస్ మహారాజా రవితేజతో ‘నేల టిక్కెట్’ తీసినా ఏమాత్రం ఆకట్టుకోలేదు. మళ్ళీ నాగార్జునతో ‘బంగార్రాజు’ తెరకెక్కించాడు. ఈ మూవీ సక్సెస్ అయ్యింది.
అయితే.. ఈ మూవీ వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కళ్యాణ్ కృష్ణ నెక్ట్స్ ఏంటనేది ప్రకటించలేదు. తాజా వార్త ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవికి కోసం ఓ కథని రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. కథ చెప్పాలని చిరంజీవిని కోరడం, చిరంజీవి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందని సమాచారం. చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ ఫ్యామిలీస్ మధ్య మంచి అనుబంధం వుంది. కారణం ఏంటంటే.. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కళ్యాణ్ కృష్ణ అన్నయ్య కురసాల కన్నబాబు పార్టీలో చేరారు.
గతంలో కన్నబాబు ఏపీ మంత్రిగా కూడా పని చేశారు. అయినప్పటికీ.. ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు వున్నాయి. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ షూటింగ్ లో వున్నారు. చిరంజీవి, 200 మంది డ్యాన్సర్ తో భారీ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత నెక్ట్స్ ఎవరితో అనేది చిరు ప్రకటించలేదు. త్వరలోనే కళ్యాణ్ కృష్ణ.. చిరంజీవికి కథ చెప్పనున్నారు. కథ నచ్చితే ఆయన లైనప్ లో మరో ప్రాజెక్ట్ సెట్ అయినట్టే. మరి.. చిరు, కళ్యాణ్ కృష్ణ కాంబో సెట్ అవుతుందో..? లేదో..? చూడాలి.