Monday, February 24, 2025
HomeTrending Newsరాజీనామా చేద్దాం రా : అచ్చెన్నకు ధర్మశ్రీ సవాల్

రాజీనామా చేద్దాం రా : అచ్చెన్నకు ధర్మశ్రీ సవాల్

విశాఖకు పాలనా రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సవాల్ చేశారు. అచ్చెన్నాయుడు అక్కడ గెలిస్తే ఆయన చెప్పిన మాటకు బద్ధులై ఉందామని సూచిచారు. నేడు విశాఖలో జరిగిన జేఏసి సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా అడ్డుకుంటున్న నేతలను రాజకీయలనుంచి వెలివేసే విధంగా ప్రజలు ఉద్యమించాలని అయన పిలుపు ఇచ్చారు. రాజధాని కోసం తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన ధర్మశ్రీ జేఏసి నేతలకు తన రాజీనామా అందించారు. స్పీకర్ కు కూడా ఒక కాపీ ఇస్తానన్నారు. జేఏసి నిర్ణయాలకు కట్టుబడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్