Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Denmark Open 2022: సేన్, ప్రణయ్ ముందంజ; సైనా ఓటమి

Denmark Open 2022: సేన్, ప్రణయ్ ముందంజ; సైనా ఓటమి

డెన్మార్క్ ఓపెన్ -2022లో భారత స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ తొలి రౌండ్ లో విజయం సాధించాడు. ఇండోనేషియా ఆటగాడు అంటోనీ సినిసుకా గింటింగ్ పై 21-16;21-12 తేడాతో విజయం సాధించాడు.

మరో పురుషల సింగిల్స్ మ్యాచ్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 21-13; 22-20 తేడాతో చైనా ఆటగాడు ఝావో జున్ పెంగ్ పై గెలుపొందాడు.

నేడు జరిగిన పురుషల డబుల్స్ మ్యాచ్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి జోడీ 21-15; 21-19 తేడాతో సౌత్ కొరియా ఆటగాడు కాంగ్ మిన్ హయుక్-సియో సియుంగ్ జంటపై విజయం సాధించారు.

మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ పై చైనా క్రీడాకారిణి ఝాంగ్ యీ మెన్ 21-17; 19-21; 21-11 తేడాతో విజయం సాధించింది.

నిన్న జరిగిన పోటీల్లో పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్ లో పుల్లెల గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించి రెండో రౌండ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్