Historical: రాష్ట్ర చరిత్రలో బైజూస్ తో ఒప్పందం ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు అపహాస్యం చేసేలా జగన్ జూస్ అంటూ మాట్లాడడం దారుణమన్నారు.
పురపాలక, పట్టణాభివృద్ధిపై నిన్న సమగ్ర సమీక్ష నిర్వహించిన సిఎం జగన్ నేడు మరోసారి రహదారుల స్థితిగతులపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి సురేష్ సచివాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే సిఎం జగన్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు వచ్చారని, దీనిపై వ్యంగ్యంగా మాట్లాడడం తగదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు కూడా ఇస్తామన్నారు.
కాగా, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, జూలై 15 లోపు రోడ్లకు గుంతలు పూడ్చి వేయాలని సిఎం ఆదేశించినట్లు సురేష్ తెలిపారు. గుంటూరు శంకర్ విలాస్, నిడదవోలు ఫ్లై ఓవర్లు, అన్ని శాఖల వద్ద నిర్మాణంలో ఉన్న 26వేల కిలోమీటర్ల రోడ్లు కూడా పూర్తి చేస్తామని మంత్రి వివరించారు.
Also Read : బైజూస్ తో ఒప్పందం : ప్రభుత్వ స్కూళ్ళలో ఎడ్యు-టెక్