Sunday, January 19, 2025
HomeTrending Newsనేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్  కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. టీపీసీసీకి చెందిన ఐదుగురు కీలక నేతలను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ లో విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసులో పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ,  సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశించింది.  కేంద్ర మాజీ మంత్రి రేణుక్ చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. వీళ్లంతా నేషనల్ హెరాల్డ్ కు నిధులు సమకూర్చారని ఈడీకి సమాచారం అందినట్టు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రశ్నించారు ఈడీ అధికారులు.

నేషనల్ హెరాల్డ్ కేసులో తనకు ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. అయితే పత్రిక నడపడానికి కొంత ఫండ్ మాత్రం తాను ఇచ్చానని షబ్బీర్ అలీ అంగీకరించారు. ఈడీ నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్