Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Hockey World Cup: నవీన్ పట్నాయక్ కు మొదటి టికెట్

Hockey World Cup: నవీన్ పట్నాయక్ కు మొదటి టికెట్

ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరగనున్న పురుషుల వరల్డ్ కప్ హాకీ -2023 టోర్నమెంట్ కు రంగం సిద్ధమైంది. జనవరి 13 నుంచి 29 వరకూ జరగనున్న ఈ మెగా ఈవెంట్ కు ఓడిశా ఆతిథ్యం ఇస్తోంది. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంతో పాటు, రూర్కెలా లో నూతనంగా నిర్మించిన బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టోర్నీ మొదటి టికెట్ ను హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు అందించారు.

దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో హాకీ ప్రపంచకప్ కు  మనదేశం ఆతిథ్యం ఇవ్వడం విశేషం. స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే 1948, లండన్ ఒలింపిక్స్ లో కిషన్ లాల్ నేతృత్వంలోని భారత జట్టు హాకీలో గోల్డ్ మెడల్ సంపాదించింది. 1952, 1956, 1964, 1980 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్ లో సైతం గోల్డ్  మెడల్స్ గెల్చుకున్న భారత హాకీ జట్టు 1960 రోమ్ ఒలింపిక్స్ లో రజతం, 1968, 72, 2020 సంవత్సరాల్లో కాంస్యం పతకం గెల్చుకుంది.  వరల్డ్ కప్ టైటిల్ ను మాత్రం 1975లో గెల్చుకుంది. ఆ ఏడు కౌలాలంపూర్ లో జరిగిన మెగా టోర్నీలో మనదేశం విజేతగా నిలిచింది.  ఇటీవలి బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ లో రెండోస్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ స్వదేశంలో జరుగుతోన్న ప్రపంచ కప్ సంబరంలో మరోసారి సత్తా చాటి కప్ గెల్చుకోవాలని  హాకీ క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్ డి లో ఇండియా, ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్ జట్లు ఉన్నాయి. టోర్నీ ఆరంభం రోజునే ఇండియా స్పెయిన్ తో తలపడనుంది. భారత హాకీ సమాఖ్య తో కలిసి ఓడిశా ప్రభుత్వం ఈ క్రీడా సంబరానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్