Sunday, January 19, 2025
HomeTrending Newsప్రధాని మోడీ విశాఖ టూర్ ఖరారు

ప్రధాని మోడీ విశాఖ టూర్ ఖరారు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆ రోజు రాత్రి ప్రధాని విశాఖలోనే బస చేస్తారు. ఈనెల 12న ఉదయం ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ, సిఎం జగన్ పాల్గొననున్నారు.  అంతకుముందు పలు పథకాలకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.

  • రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్‌ నవీకరణ, ఈస్ట్‌కోస్టు జోన్‌ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన,
  • రూ.260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్‌ వర్క్ షాపు, రూ.26వేల కోట్లతో చేపట్టిన హెచ్‌పీసీఎల్‌ నవీకరణ, విస్తరణ పనులకు శ్రీకారం
  • రూ.152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, రూ.560 కోట్ల ఖర్చుతో కాన్వెంట్‌ కూడలి నుంచి షీలానగర్‌ వరకు పోర్టు రహదారికి శంకుస్థాపన
  • రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనం ప్రారంభం
  • విశాఖ-వారణాసి మధ్య కొత్తగా ప్రవేశపెట్టనున్న రైలుకు ప్రధాని పచ్చ జెండా ఊపే అవకాశం ఉందని తెలిసింది. ఈ కార్యక్రమం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమాలు కాబట్టి తమ మార్కు ఉండేలా పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు బిజెపి ఆంధ్ర ప్రదేశ్ శాఖ సన్నాహాలు చేస్తోంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్