తెలంగాణ లో రైతులకు గౌరవం లేదని, పండించిన పంట కి గిట్టు బాటు లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. తాలు తరుగు అని రైతును నిండా ముంచుతున్నరన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల పాదయాత్ర సిద్ధిపేట జిల్లాలో సాగుతోంది. ఈ రోజు హుస్నాబాద్ నియోజక వర్గం, సైదాపూర్ మండల కేంద్రంలో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన స్థానికులు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే…
సిఎం కెసిఆర్ కౌలు రైతు తెలంగాణలో రైతే కాదు అంటున్నాడు. ఉద్యోగాల పేరుతో 8 ఏళ్లుగా మోసమే జరుగుతోంది. ఉద్యోగాల కోసం సాదించుకున్న తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని..? నోటిఫికేషన్ లు ఇవ్వండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..అయినా కేసీఅర్ లో చలనం లేదు. బంగారు తెలంగాణ అని చెప్పి ఏ వర్గానికి బ్రతుకే లేని తెలంగాణ గా చేశారు. TRS BJP,congres పార్టీలు స్వార్థ పూరిత రాజకీయ పార్టీలు. మాట మీద నిలబడే నాయకుడు లేడు. వైఎస్సార్ పథకాలు ఖూనీ చేశారు. వైఎస్సార్ పాలన ఈ గడ్డ పై మళ్ళీ రావాలి. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు వస్తనని షర్మిల చెప్పారు.
Also Read : బండి సంజయ్, మంత్రి గంగుల ఇద్దరు ఒకటే వైఎస్ షర్మిల