Sunday, January 19, 2025
HomeTrending Newsపాక్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు

పాక్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం ఘటనపై ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి నుంచి పౌరులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇమ్రాన్ సొంత రాష్ట్రం కావటం… పటాన్ వర్గానికి చెందిన నేత కావటంతో కేపి ప్రావిన్సు ఉద్రిక్తంగా మారింది. ఇమ్రాన్ ప్రాతినిద్యం వహిస్తున్న పెషావర్ నగరంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ శ్రేణులు ఈ రోజు ఆందోళనకు దిగాయి. ఇమ్రాన్ పై దాడి వెనుక ఆర్మీ హస్తం ఉందని వారు ఆరోపించారు. పెషావర్ లోని సైనిక కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో నిరసనకారులు చేరుకోవటం కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీసింది.

పాకిస్తాన్ 75 ఏళ్ళ చరిత్రలో మిలిటరీపై ఆరోపణలు చేస్తు బహిరంగంగా నిరసనలకు దిగటం ఇదే మొదటి సారని విశ్లేషకులు అంటున్నారు. పంజాబీ రాష్ట్రేతరుడు ఇమ్రాన్ రాజకీయంగా నిలదోక్కుకొకుడదని కొందరు కుట్ర చేశారని ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్ర వాసులు ఆరోపణలు చేస్తున్నారు. పాక్ రాజకేయ, అధికార వ్యవస్థలో అత్యధికంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే ఉంటారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని, పాక్ ఆర్మీ చీఫ్ నియామకానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ లాహోరు నుంచి ఇస్లామాబాద్ కు లాంగ్ మార్చ్ చేపట్టారు.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై బుధవారం హత్యాయత్నం ఘటనపై భారత్‌ స్పందించింది. పాక్‌లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ‘మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఓ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఓ కన్నేసి ఉంచాం. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌.. పాక్‌ పంజాబ్‌లోని వజీరాబాద్‌ అల్లావాలాచౌక్‌లో నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఇమ్రాన్‌ కాలికి తూటా తగిలింది. ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురికి కూడా తూటాలు తగిలాయి. ఇమ్రాన్‌ను వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకొంటున్నారని జియోటీవీ తెలిపింది. ఇమ్రాన్‌ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్‌ను లాహోర్‌కు తరలిస్తున్నట్టు వెల్లడించాయి.

Also Read ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్