జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్‌తోపాటు ఇతర నగరాలకు, రాష్ట్రాలకు వ్యాపించాయి. యువత, విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. సోమవారం వేలాది మంది వీధుల్లోకి వచ్చి జిన్‌పింగ్ ప్రభుత్వానికి, కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. తమకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్ చేశారు. షాంఘైలో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. సుమారు వెయ్యి మంది ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు.
ఆందోళనలు యూనివర్సిటీలకు కూడా వ్యాపించాయి. విద్యార్థులు పోస్టర్లు అతికించి నిరసన వ్యక్తం చేశారు. బానిసలుగా కాకుండా పౌరులుగా చూడండి అని బ్యానర్లు ప్రదర్శించారు. లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా సకాలంలో అగ్నిమాపక వాహనాలు చేరుకోకపోవడంతో జిన్‌జియాంగ్ రీజియన్‌లో ఉరుమ్‌ఖీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం కారణంగా 10 మంది మృతిచెందడం.. తాజా ఆందోళనకు బీజం వేసింది.
Also Read : చైనాలో అగ్నిప్రమాదం..38 మంది సజీవ దహనం