Sunday, April 6, 2025
HomeTrending Newsచిన్నారులతో రాహుల్ గాంధి క్రికెట్

చిన్నారులతో రాహుల్ గాంధి క్రికెట్

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా కొనసాగుతోంది.  హైదరాబాద్ శివారులో నిన్న రాత్రి బస చేసిన గణేష్‌ గడ్డ నుంచి 57వ రోజు రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర ప్రారంభించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ప్రజలు రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు.

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న రాహుల్ కాస్సేపు సేదతీరేందుకు చిన్నారులతో సరదాగా గడుపుతున్నారు. ఇలా ఓ చిన్నారితో కలిసి రోడ్డు పైనే క్రికెట్ ఆడారు. రాహుల్ బౌలింగ్ చేయగా చిన్నారి బ్యాటింగ్, టిపిసిసి చీఫ్ రేవంత్, మాజీ ఎమ్మెల్యే సంపత్ ఫీల్డింగ్ చేసారు. మరోచోట చిన్నారికి బాక్సింగ్ మెలకువలు నేర్పించారు రాహుల్. ఇవాళ 25 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. చేర్యాల, కంది, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఫసల్వాదీ మీదుగా శివంపేట వరకు రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుంది.

Also Read : హైదరాబాద్ లో హుషారుగా సాగుతున్న జోడో యాత్ర

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్