Sunday, January 19, 2025
HomeTrending Newsఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Release Of Mlc Election Schedule :

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నవంబర్ 17వ తేదీన నామినేషన్ల పరిశీలన, నవంబరు 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది. నవంబర్ 29న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 29 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి అదే రోజు ఫలితాల ప్రకటన చేస్తారు.

Must Read :తెలంగాణలో జూట్ మిల్లులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్