నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా RRR చిత్ర యూనిట్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్ గౌడ్ శుభాభినందనలు తెలిపారు. RRR చిత్ర నటులు జూనియర్ NTR, రాంచరణ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, చంద్ర బోస్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ గీతాన్ని రచించిన తెలంగాణ ముద్దుబిడ్డ చంద్రబోస్ ఆలాపించిన తెలంగాణ ముద్దుబిడ్డలు, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లకు మంత్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాహుబలి సినిమాతో తెలుగు సినీ ప్రస్థానాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తెలుగుజాతి విప్లవ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు లకు అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని తీసుకురావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ గేయానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా అభినందించారు.
నాటు నాటుపాట ప్రపంచాన్ని ఆకర్షించడానికి కీలక భూమిక వహించిన కథానాయకులు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఆస్కార్ బరిలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ కేటగిరిలో గెలిచి నిలిచిన మరో చిత్రం ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర యూనిట్ని కూడా ఈ సందర్భంగా అభినందించారు. తెలుగు సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
Also Read : RRRకు అభినందనల వెల్లువ