Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష రద్దు...జూన్‌ 11న మళ్ళీ ప్రిలిమ్స్‌

తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష రద్దు…జూన్‌ 11న మళ్ళీ ప్రిలిమ్స్‌

ప్ర‌శ్నాప‌త్రాల లీకేజ్ కార‌ణంతో ఆక్టోబ‌ర్ లో నిర్వ‌హించిన గ్రూప్ వ‌న్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్ర‌క‌టించింది. అలాగే ఏఈఈ, డీఏఓ పరీక్షలు సైతం రద్దు చేశామ‌ని వెల్ల‌డించింది. గతేడాది అక్టోబరు 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్ , జనవరి 22న ఏఈఈ , ఫిబ్రవరి 26న డీఏవో పరీక్ష నిర్వహించింది టిఎస్ పి ఎస్ సి..జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది.. రద్దైన ఏఈఈ, డీఏవో పరీక్షల తేదీలు త్వరలో వెల్లడిస్తామ‌ని తెలిపింది.

ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్ పీఎస్సీ.. ఇప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు, త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేయాలనే యోచనలో టీఎస్ పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్ కళాశాల అధ్యాపకుల పరీక్ష కూడా రద్దు చేసే అవకాశం ఉంది.

విద్యావేత్తలను కాకుండా రాజకీయ నాయకులు, అధికారులతో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ , సభ్యుల పోస్టులు భర్తీ చేయటం వల్లే ఈ దుస్థితి దాపురించిందని విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి.

Also Read : పేపర్ లీకేజీతో కేటీఆర్ కు సంబంధం ఉంది – బండి సంజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్