Saturday, February 22, 2025
Homeసినిమాగట్టిపోటీ మధ్యలో బరిలో దిగుతున్న 'టైగర్ నాగేశ్వరరావు'

గట్టిపోటీ మధ్యలో బరిలో దిగుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’

రవితేజ నుంచి క్రితం ఏడాది మూడు సినిమాలు థియేటర్లకు రాగా, వాటిలో ‘ధమాకా’ మాత్రమే విజయాన్ని అందుకోగలిగింది. ఈ ఏడాది ఇంతవరకూ ఆయన నుంచి రెండు సినిమాలు రాగా, ‘వాల్తేరు వీరయ్య’ మాత్రమే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో ఆయన నుంచి మరో సినిమా రానుంది .. అదే ‘టైగర్ నాగేశ్వరరావు‘. ఈ దసరా కానుకగా ఈ సినిమా ఈ నెల 20 తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా కోసమే రవితేజ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

1970లలో ఈ కథ నడుస్తుంది .. గజదొంగ ‘టైగర్ నాగేశ్వరావు’ ఆ కాలంనాటి వాడేమరి. స్టూవర్ట్ పురం దొంగగా అప్పట్లో అందరినీ గజగజలాడించిన నేరచరిత్ర ఆయనకి ఉంది. ఆ పాత్రలోనే రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమాతోనే దర్శకుడు వంశీ పరిచయమవుతున్నాడు. అలాగే బాలీవుడ్ నుంచి నుపుర్ సనన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. మరో కథానాయికగా గాయత్రి భరద్వాజ్ అలరించనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బాణీలు ఇప్పటికే మంచి మార్కులు దక్కించుకున్నాయి. మూడో సింగిల్ ను రేపు వదులుతున్నారు.

ఇక ఈ సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉందనే విషయం అలా ఉంచితే, థియేటర్ల దగ్గర గట్టి పోటీ మాత్రం ఉంది. ఈ సినిమాకి ఒకరోజు ముందే బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా బరిలోకి దిగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక అదే రోజున విజయ్ ‘లియో’ కూడా రంగంలోకి దిగుతోంది. విజయ్ తో పాటు లోకేశ్ కనగరాజ్ కి గల ఇమేజ్ కూడా ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచింది. మరో వైపున కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ కూడా రిలీజ్ అవుతోంది. ఇంత పోటీని ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎలా తట్టుకుంటాడో చూడాలి.

Also Read:Tiger Nageswara Rao Trailer: టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ బాగుంది కానీ..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్