Tsrtc Special Package : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది.
హైదరాబాద్ నుండి ప్రత్యేకమైన బస్సు సర్వీసులను ప్రారంభించి ప్రకృతి ప్రేమికులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తూ, వారి ఆదర అభిమానాలను చురగొంటుంది టీఎస్ ఆర్టీసీ.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకృతి ప్రేమికులైన పర్యటక యాత్రికులకు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించారు..
పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి చెందే విధంగా ఆర్టిసి సంస్థ నేరుగా పర్యాటక ప్రదేశాలకు బస్సు సర్వీసులను నడపడం జరుగుతుందని చెప్పారు.
విహార యాత్రలు చేసేవారికి అణువుగా ఆర్టిసి బస్సు సౌకర్యాలు అందించడం జరుగుతుందని, ప్రజలందరూ ఆర్టీసీ సంస్థను ఆదరించాలని అన్నారు.
1. పోచంపాడు, 2. పొచ్చేర, 3. కుంటాల, జలపాతాలకు ప్రత్యేకంగా కేటాయించిన బస్సులు.
హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి ఉదయం 5 గంటలకు బయలుదేరు ఫ్లాట్ ఫామ్ నెంబర్లు 55, 56 ఈ ప్లాట్ఫాములలో హైదరాబాద్ నుండి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు నేరుగా పర్యాటక ప్రదేశాలకు ప్రయాణికులను చేర్చడం జరుగుతుంది.
జేబీఎస్ బస్ స్టేషన్ నుండి ఉదయం 5:30 గంటలకు ప్లాట్ ఫాం నెంబర్ 20.
ఈ బస్సు సర్వీసులలో ఉదయం 7:00 గంటలకు అల్పాహారం తూప్రాన్ వద్ద అందించడం జరుగుతుంది.
పర్యాటక ప్రదేశాల వివరాలు.
1. పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వీక్షించే సమయాలు.
ఉదయం 10 గంటలనుండి 11 గంటల వరకు.
2. పొచ్చేర జలపాతం వీక్షించే సమయం.
మధ్యాహ్నం 12 :15 నుండి 13:30 వరకు పొచ్చెరా అందాలను వీక్షించవచ్చు.
3. కుంటాల జలపాతం
వీక్షించే సమయాలు 14:00 నుండి 17:00 వీక్షించిన తర్వాత మధ్యాహ్నం కుంటాల పరిసర ప్రాంతాలలో భోజన సౌకర్యం కలదు.
మూడు ప్రాంతాలను వీక్షించిన అనంతరం ప్రయాణికులు వారి వారి వస్తువులను జాగ్రత్తగా తీసుకొని బస్సులో కూర్చోవాలి.
తిరిగి హైదరాబాద్ చేరుకొను సమయం 22:45 నిమిషాలకు చేరును.
మొత్తం మూడు ప్రదేశాలకు ఒక్కొక్కరికి పెద్దలకు ₹ 1099 /- పిల్లలకు 599/-
నిజామాబాద్ నుండి కుంటాల జలపాతంకు ప్రత్యేక బస్సు సర్వీసులు..
నిజామాబాద్ ప్రధాన బస్ స్టేషన్ నుండి ప్రతి ఆదివారం ఉదయం 8:00 గంటలకు ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలిపారు..
ఈ బస్సు నిజామాబాద్ నుండి పోచ్చెర జలపాతం వద్దకు 10:15 నిమిషాలకు చేరుకుంటుంది.
పోచ్చేర జలపాతం నుండి కుంటాల జలపాతం వద్దకు మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంటుంది.
ప్రయాణికులను మళ్లీ సాయంత్రం 5:00 గంటలకు నిజామాబాద్ చేరుస్తుంది.
పెద్దలకు 420 రూపాయలు.
పిల్లలకు 200 చార్జీలు వసూలు చేయడం జరుగుతుంది.
నిర్మల్ బస్టాండ్ నుండి కుంటల జలపాతం వరకు బస్సు సర్వీసులను ప్రారంభించడం జరిగింది.
పెద్దలకు 200 రూపాయలు.
పిల్లలకు 110 రూపాయలు నిర్ణయించడం జరిగింది.
గమనిక అల్పాహారం మరియు భోజన ఖర్చు ప్రయాణికులదే.
టికెట్లు బుక్ చేసుకోవడానికి టిఎస్ ఆర్టిసి వెబ్సైట్ను www.tsrtconline.in సందర్శించండి.
మరిన్ని వివరాల కోసం సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించగలరు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలను కళాశాల విద్యార్థులు మరియు యాజమాన్యాలు, పాఠశాల విద్యార్థులు, యాజమాన్యాలు, మరియు ప్రకృతి ప్రేమికులు విహారయాత్రలు చేసేవారు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు..
Also Read : ఆదాయం పెంపునకు TSRTC వంద రోజుల ప్రణాళిక