సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదని, తమ పార్టీ విధానమని… ఈ దిశగానే గత మూడున్నరేళ్లుగా తాము అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్ధుల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాతో పాటు, గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం కోసం ప్రతిపాదించనున్న అభ్యర్ధుల జాబితాను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు 9, ఎమ్మెల్యే కోటాలో 7, గవర్నర్ కోటాలో 2 మంది అభ్యర్ధుల వివరాలు:
స్థానిక సంస్థల కోటాలో:
- నర్తు రామారావు – శ్రీకాకుళం – యాదవ
- కుడుపూడి సూర్యనారాయణ – తూర్పు గోదావరి – శెట్టి బలిజ
- వంకా రవీంద్రనాథ్ – పశ్చిమ గోదావరి – కాపు
- కవూరు శ్రీనివాస్ – తూర్పు గోదావరి – శెట్టి బలిజ
- మేరుగు మురళీధర్ – నెల్లూరు – ఎస్సీ మాల
- సిపాయిసుబ్రహ్మణ్యం – చిత్తూరు – వన్నె రెడ్డి బిసి
- పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి – వైఎస్సార్ కడప – రెడ్డి
- ఏ.మధుసూడాన్ – కర్నూలు బాల్మీకి బోయ
- శ్రీమతి మంగమ్మ – అనంతపురం – వాల్మీకి బోయ
ఎమ్మెల్యే కోటాలో
- పెన్మత్స సూర్యనారాయణ రాజు – విజయనగరం – క్షత్రియ
- పోతుల సునీత – బాపట్ల – పద్మ శాలీ
- కోలా గురువులు – విశాఖ పట్నం సౌత్ – వాడ బలిజ
- బొమ్మి ఇజ్రాయెల్ – అమలాపురం – ఎస్సీ
- జయమంగళ వెంకట రమణ – కైకలూరు – ఏలూరు జిల్లా – వడ్డీ
- చంద్రగిరి యేసు రత్నం – గుంటూరు – బిసి వడ్డెర
- మర్రి రాజశేఖర్ – గుంటూరు – కమ్మ ఓసి
గవర్నర్ కోటాలో:
- కుంభా రవిబాబు – అరకు జిలా – ఎస్టీ ఎరుకల
- కర్రి పద్మశ్రీ – కాకినాడ – వాడ బలిజ – బిసి