గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. భద్రాచలం బ్రిడ్జిపై గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నామని చెప్పారు. వరద ముంపు దృష్ట్యా వంతెనపై రెండ్రోజులపాటు రాకపోకలు ఆపేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 60.30 అడుగులకు చేరింది. నదిలో ప్రస్తుతం 18.16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. దీంతో భద్రాచలం పట్టణాన్ని వరదనీరు చుట్టుముడుతున్నది. పట్టణంలోని కొత్తకాలనీ, సుభాష్‌నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతంలోకి వరద నీరు చేరింది.
Also Read : భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ