Sunday, January 19, 2025
HomeTrending Newsవాషింగ్టన్ లో ఘనంగా ఆటా వేడుకలు

వాషింగ్టన్ లో ఘనంగా ఆటా వేడుకలు

కరోనా కష్టాలను అధిగమించి రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుపుకుంటున్న తెలుగు ప్రపంచ పండుగ ఈ ఆట మహాసభలని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఇలా అందరినీ కలవడం, మనమంతా ఒక కుటుంబం లాగా, గడపడానికి మించిన ఆనందం బహుశా ఎక్కడా దొరకదన్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీ లో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ – ఆటా – 17వ మహాసభలకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆలా వెంకటేశ్వర రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, రవీంద్ర కుమార్, చంటి క్రాంతి కిరణ్, గాదరి కిషోర్, tsiic చైర్మన్ గాదరి బాలమల్లు, ఇతర ప్రజా ప్రతినిధులతో, అహూతులతో, ఆటా ప్రతినిధులు, nri మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:

వేడుకల్లో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ, ఈ వేడుకను తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్లంతా, ఈ భూమిపై వేర్వేరు చోట్ల నివసిస్తున్న తెలుగు వాళ్లంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఆటా మహాసభలు ఎంతో ప్రత్యేకమైనవి. మనం ఎక్కడ ఉన్నా మన దేశ భక్తిని, కన్న తల్లి ని, పుట్టిన ఊరిని మరచిపోలేదని చాటే సందర్భం. ఉన్న ఊరు (usa) ను కూడా మరవని మన విశ్వసనీయత కు గుర్తు ఈ మహా సభలు. మనం ఎక్కడ ఉన్నా, మన పనితనం తో ఇక్కడి, మన దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాం. ఉంటాం. దేశ సంపద పెంపులో, నిర్మాణంలో మనమే ముందున్నం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్