Sunday, January 19, 2025
HomeసినిమాAkkineni Nagarjuna: యంగ్ బ్యూటీతో నాగ్ రొమాన్స్?

Akkineni Nagarjuna: యంగ్ బ్యూటీతో నాగ్ రొమాన్స్?

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తనకంటే తక్కువ వయసున్న జయప్రద, జయసుధ, శ్రీదేవి తదితర కథానాయికలతో  నటించి అన్నివర్గాల ప్రేక్షకులను అలరించారు. అలాగే నాగార్జున కూడా అనుష్క, లావణ్య త్రిపాఠి తదితర కథానాయికలతో కలిసి పనిచేశారు. అంతే కాకుండా. సుస్మితా సేన్, ఐశ్వర్యరాయ్ లతో కూడా నటించి మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ లతో నటించిన ఏకైక తెలుగు హీరోగా కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ అమ్మాయిల్లో నాగ్ కు ఫాలోయింగ్ ఉండడం విశేషం.

ఇటీవలే అరవై ఏళ్లు దాటిన కింగ్ నాగార్జున  రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నారు. ఇది మలయాళం మూవీ రీమేక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ నెలలోనే  సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. దీనిలో నాగార్జున రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి యంగ్ క్యారెక్టర్ కాగా, రెండోది ఓల్డ్ క్యారెక్టర్. అయితే.. అరవై ఏళ్లు దాటిన వయసులో కూడా నాగ్ 26 ఏళ్ల అమ్మాయితో రొమాన్స్ చేయనున్నాడట. 2020 ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుని మిస్ వరల్డ్ 2021లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన తెలుగు మోడల్ అందాల పోటీ విజేత మానస వారణాసి ఈ సినిమలో నాగ్ కు  జంటగా నటిస్తోందట.

ఇలా రెండు వేరియేషన్స్ తో పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయట.  నాగ్, మానస మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయంటున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ చిత్రాలతో నిరాశపరిచిన నాగార్జున ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్