Sunday, September 8, 2024
Homeజాతీయంఆక్సిజన్ సరఫరా జాప్యం : 26 మంది మృతి

ఆక్సిజన్ సరఫరా జాప్యం : 26 మంది మృతి

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కొంతసేపు ఆక్సిజన్ నిలిచిపోయిన నేపథ్యంలో 11 మంది కరోనా రోగులు మృత్యువాత పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. గోవాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పనాజీలోనూ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపంతో 26 మంది కరోనా రోగులు తనువు చాలించారు. అర్ధరాత్రి తర్వాత 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో వీరంతా కన్నుమూశారు. గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని గోవా హైకోర్టుని కోరారు.

కాగా, ఈ ఘటన జరిగిన ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సందర్శించారు. మెడికల్ ఆక్సిజన్ లభ్యత, సరఫరా ఈ రెండు అంశాల మధ్యలో ఏర్పడిన అంతరాయం ఈ పరిస్థితికి దారితీసి ఉంటుందని సీఎం సావంత్ అభిప్రాయపడ్డారు. అయితే తమ వద్ద ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్