జర్మనీలోని ఫుర్త్‌లో గల సెయింట్ పాల్స్ చర్చిలో ఫాదర్‌కు బదులు ఆధ్యాత్మిక ప్రసంగం చేసి శభాష్ అనిపించుకుంది చాట్‌జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అయిన చాట్ జీపీటీ గత ఏడాది నవంబర్ లో అధికారికంగా ప్రారంభించినప్పటి నుండి కవితలు, ప్రసంగాలు, పరీక్ష ప్రశ్నలకు సంబంధించి ఏదీ అడిగినా సమాధానాలు ఇవ్వడంతో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇటీవలే చాట్ జీపీటీని ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయడంతో వివిధ అంశాలపై సంభాషణా పద్ధతిలో మరింతగా సమాధానాలు అందిస్తోంది. నాలుగు ఏఐ అవతార్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్తమానంలో జీవించడం, జీసస్‌పై విశ్వాసం ఉంచడం, మరణానికి భయపడకపోవడం వంటి అంశాలను స్పృశిస్తూ 40 నిముషాల పాటు సాగిన చాట్‌జీపీటీ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని వినేందుకు 300 మంది భక్తులు హాజరయ్యారు.
ఏఐ చాట్ బాట్ అయిన చాట్ జీపీటీని నిత్యానంద స్వామీ ఎవరని ప్రశ్నించగా.. ఆయన వివాదాస్పద భారతీయ ఆధ్యాత్మిక గురువు, నిత్యానంద ధ్యానపీఠం సంస్థ వ్యవస్థాపకుడు అని పేర్కొంది. ఆయన 1977లో తమిళనాడులో జన్మించారనీ, తాను జ్ఞానవంతుడినని, హిందూ మతం, బౌద్ధం, నవయుగ ఆధ్యాత్మికత మేళవింపును బోధిస్తున్నానని చెప్పుకున్నట్టు చాట్ జీపీటీ తన సమాధానంలో చెప్పింది. 2010లో జరిగిన అత్యాచారం కేసు, ఆ తర్వాత బెయిల్ గురించి కూడా ఏఐ చాట్ బాట్ ప్రస్తావించింది. ఇక ‘కైలాస’ అని పిలువబడే దేశం గురించి చాట్ జీపీటీని అడగ్గా.. “నిత్యానంద కైలాస అనే కొత్త దేశాన్ని స్థాపించినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, కైలాస అనేది సనాతన హిందూ ధర్మ పురాతన జ్ఞానోదయ హిందూ నాగరికత పునరుజ్జీవనం, ఇది కాలక్రమేణా కోల్పోయింది లేదా అణిచివేయబడిందని ఆయన నమ్ముతున్నాడు” అని పేర్కొంది.