Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఏపి హైకోర్టుకు కేంద్ర అడ్వకేట్ ప్యానల్

ఏపి హైకోర్టుకు కేంద్ర అడ్వకేట్ ప్యానల్

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించడానికి ఐదుగురు సభ్యుల న్యాయవాదుల ప్యానల్ ను నియమిస్తూ భారత న్యాయ మంత్రిత్వ శాఖఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఆదాయపు పన్ను, రైల్వే శాఖలు మినహా కేంద్రానికి సంబంధించిన అన్నిఇతర శాఖల అంశాలపై ఏపీ హైకోర్టులో వాదిస్తారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఏర్పడిన కేంద్రప్రభుత్వం నియమించిన మొట్టమొదటి అడ్వకేట్ ప్యానల్ ఇది. కిలారు కృష్ణభూషణ్ చౌదరి, జె.విఎం.వి.ప్రసాద్, దాట్ల దివ్య, జూపూడి వెంకట కుమార్ యజ్ఞదత్, వెన్నా హేమంత్ కుమార్ లను కేంద్ర న్యాయ శాఖ నియమించింది. వీరు మూడేళ్ళపాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్