-0.4 C
New York
Thursday, December 7, 2023

Buy now

HomeTrending Newsపీసీఏ చైర్మన్ గా కనగారాజ్?

పీసీఏ చైర్మన్ గా కనగారాజ్?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.  గత ఏడాది ఎస్‌ఈసీగా కనగరాజ్‌ ను ప్రభుత్వం నియమించింది అయితే కోర్టు ఆదేశాలతో అయన తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆయనకు సముచిత గౌరవం ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే పోలీసులపై ఫిర్యాదులను విచారించేందుకు గాను పీసీఏ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు.

పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో కూడా జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు.

హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాలి అని నిబంధనలు ఉన్నాయి.  పీసీఏలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌తో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. పీసీఏ  సిఫారసులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయం.  ఈ అథారిటీ ఏర్పాటుపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్