Thursday, November 28, 2024
Homeసినిమాకార్తికేయ దూకుడు పెంచలవలసిందే!

కార్తికేయ దూకుడు పెంచలవలసిందే!

ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు హిట్ అనే మాట విని చాలా కాలమైంది. సరైన హిట్ పడని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నాగచైతన్య .. నాగశౌర్య .. శర్వానంద్ .. అఖిల్ .. కార్తికేయ .. ఇలా చాలామంది ఆ జాబితాలో కనిపిస్తారు. కార్తికేయ విషయానికి వస్తే, ఆయన ఫస్టు మూవీ ‘RX 100’ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ పరంగా ఆ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమాతోనే కార్తికేయ హీరోగా నిలబడ్డాడు. ఆ తరువాత ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళ్లాడు. అభిమానులతో గ్యాప్ రాకుండా చూసుకున్నాడు.

అయితే కార్తికేయ కథల ఎంపిక విషయంలో పొరపాట్లకు చేస్తూ వెళ్లాడు. వరుసగా సినిమాలు చేయాలనే కంగారులో కథలపై పెద్దగా కసరత్తు జరక్కుండానే సెట్స్ పైకి వెళ్లాడు. అందువలన ఆయన నుంచి వరుసగా థియేటర్లకు సినిమాలు వచ్చాయి గానీ, ఆ థియేటర్ల నుంచి సక్సెస్ టాక్ మాత్రం బయటికి రాలేదు. ‘రాజా విక్రమార్క’ తరువాత ఆయన నుంచి తెలుగులో సినిమా లేదు. అంటే చాలా కీలకమైన సమయంలో గ్యాప్ వచ్చేసినట్టే. ఆ తరువాత ‘వలిమై’ వచ్చినప్పటికీ, అది అనువాదమే అవుతుంది. అలా చూసినా ఆ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నే మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే కార్తికేయ ‘బెదురులంక 2012’ సినిమా చేశాడు. ఈ సినిమా విడుదలకి సిద్ధమై చాలా రోజులైంది. ఒకటి రెండు సార్లు వాయిదా వేసుకుని, సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమా సక్సెస్ పైనే కార్తికేయ ఆశలు పెట్టుకున్నాడు. అయితే సరైన కథ కోసం వెయిటింగ్ అంటూ ఇటీవల హీరోలు కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ అదే మైనస్ అవుతుందని గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ చాలా ఫాస్టుగా కథల విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ .. ప్రాజెక్టులను సెట్ చేస్తూ వెళ్లవలసిందే. సీనియర్ స్టార్ హీరోలంతా అనుసరించింది .. ఆచరించింది ఈ సూత్రాన్నే అనే విషయాన్ని మరిచిపోకూడదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్