ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో స్పష్టం చేశారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు కనుక ఇంటి నంబర్ అయినా సరే.. లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి భరోసా ఇచ్చారు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కి ధరఖాస్తులు పంపించవచ్చని వెల్లడించారు.
ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇండ్లు లేని పేదలు ఆందోళన అక్కర్లేదని, దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారని మంత్రి వేముల తెలిపారు. ప్రతి పక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి నిజామాబాద్ హెలికాప్టర్ లో బయలు దేరిన మంత్రులు కేటీఆర్,వేముల ప్రశాంత్ రెడ్డి,ఎంపి సురేష్ రెడ్డి,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు.