Friday, September 20, 2024
HomeTrending NewsTS Teachers: ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్‌ విడుదల

TS Teachers: ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనుంది. తుది తీర్పునకు లోబడే టీచర్ల బదిలీలు జరగాలని హైకోర్టు ఆదేశించింది. బదిలీల కోసం ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు పంపింది.

దీనిప్రకారం బదిలీలు కోరుకునేవారు ఈ నెల 3 నుంచి 5 వరకు అన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 6,7 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలి. 8, 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు అధికారులు డిస్‌ప్లే చేస్తారు. 10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 12,13న సీనియారిటీ జాబితాలను ప్రచురిస్తారు. 14న ఎడిట్‌ చేసుకునేందుకు ఆప్షన్‌ ఇస్తారు. 15న ఆన్‌లైన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టి, 16న ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ప్రదర్శిస్తారు. 17,18,19 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇస్తారు.

20, 21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ప్రదర్శన చేస్తారు. 21న వెబ్‌ ఆప్షన్లు పెట్టుకుంటే.. 22న ఎడిట్‌ ఆప్షన్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 23,24 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలు చేపడతారు. 24న స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీల ప్రదర్శన ఉంటుంది. 26, 27, 28 తేదీల్లో ఎస్టీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు పొందుతారు. 29,30,31 ఎస్టీటీ ఖాళీల ప్రదర్శన ఉంటుంది. అక్టోబర్‌ 2న ఎడిట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. అక్టోబర్‌ 3న ఎస్టీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు చేపడతారు. అక్టోబర్‌ 5 నుంచి 19వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్