Friday, November 22, 2024
HomeTrending NewsJapan: నిర్దేశిత కక్ష్యలోకి హెచ్‌2-ఏ స్పేస్‌ క్రాఫ్ట్‌

Japan: నిర్దేశిత కక్ష్యలోకి హెచ్‌2-ఏ స్పేస్‌ క్రాఫ్ట్‌

జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండ్‌ చేయడమే లక్ష్యంగా జపాన్‌ గురువారం ల్యాండర్‌ను ప్రయోగించింది. జపాన్‌లోని టనేగషిమా స్పేస్‌ సెంటర్‌ నుంచి స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వేస్టిగేటింగ్‌ మూన్‌ (స్లిమ్‌) స్పేస్‌క్రాఫ్ట్‌ను మోసుకుంటూ హెచ్‌2-ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగించిన 13 నిమిషాల తర్వాత ఆ రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టింది. మూడు నుంచి నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి ఉపరితలాన్ని చేరుకునే అవకాశం ఉంది.

అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుని ఉపరితలాన్ని తాకిన ఐదో దేశంగా జపాన్‌ చరిత్ర సృష్టించనుంది. కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా జపాన్‌ మూన్‌ స్నిపర్‌ మిషన్‌ మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA), నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన పరిశోధన ఉపగ్రహాన్ని కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని దక్షిణ జపాన్‌లోని తనేగషిమా నుంచి ఆన్‌లైన్‌లో 35 వేల మందికి ప్రత్యక్షంగా తిలకించారు. షెడ్యూల్‌ ప్రకారం గత నెల 28న హెచ్‌-2ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్